ఇప్పుడు దేశంలో ప్రతీ పనికీ ఆధార్ అటాచ్ చేయడం కంపల్సరీ అయిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజాలు పొందాలంటే సంబంధిత స్కీమ్స్‌కు ఆధార్ కార్డు అనుసంధానం చేయడం తప్పనిసరి. అయితే మన ఆధార్‌ను ఇప్పటివరకు అనేక సంధర్భాల్లో మన ఆధార్ వివరాలు అనేక చోట్ల ఎన్రోల్ చేసి ఉంటాం. అయితే ఎక్కడెక్కడ ఎందుకోసం ఉపయోగించారో మనకు గుర్తు ఉండదు.

ఈ క్రమంలో యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆధార్ కార్డు వివరాలను ఎక్కడెక్కడ ఉపయోగించాలో తెలుసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆధార్ అథంటికేషన్ హిస్టరీ వివరాలు తెలుసుకోవాలి. ఈ వివరాలను మీరొక్కరే చూసే అవకాశం ఉంది. అయితే ఆధార్‌తో మొబైల్ లింక్ చేసి ఉండాలి. మరెవరూ మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారనే సమాచారాన్ని చూడలేరు. ఆధార్ నెంబర్ మీ ప్రమేయం లేకుండా ఎవరైనా, ఎక్కడైనా ఉపయోగించి ఉంటే మీరు అథంటికేషన్ యూజర్ ఏజెన్సీకి ఫిర్యాదు చేయవచ్చు. యూఏడీఏఐ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లొచ్చు. దీని కోసం 1947కు ఫోన్ చేయవచ్చు. లేదంటే help@uidai.gov.inకు మెయిల్ పంపొచ్చు.