భర్తల వయసు భార్యల కన్నా ఎందుకు ఎక్కువ ఉండాలోచెప్పే 5కారణాలు

0
1625

సాధారణంగా భార్యా భర్తల్లో భర్త వయసు ఎక్కువగాను, భార్య వయసు తక్కువగానూ ఉంటుంది. ఇది ఇలాగే ఉండాలా? భర్త వయసు తక్కువగా ఉంటే ఏమవుతుంది? ఈ ఆసక్తికర విషయాన్ని ఓ సారి చర్చించుకుందాం.. భార్య వయసు భర్త వయసు కంటే 2-7 సంవత్సరాలు తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలా మంది పెద్దల అభిప్రాయం. దానికి ఉన్న 5 కారణాలు ఇవే..

తెలివి విషయంలో: సహజంగా మహిళలకే తెలివి ఎక్కువగా ఉంటుంది. వీళ్లు 3-5 ఏళ్లు అడ్వాన్స్ గా ఆలోచిస్తారు. కాబట్టి వాళ్లకు వారి కన్నా ఎక్కువ వయసున్న వారితో వివాహం జరిపించి బ్యాలెన్స్ చేస్తారు. కుటుంబాన్ని నడపడంలో: భర్త కంటే భార్య వయసు తక్కువగా ఉండడం వల్ల వృద్ధాప్యంలో భర్తకు భార్య అన్నీ తానై సేవ చేసే వీలుంటుంది. అలా కాకుండా ఇద్దరూ ఒకే వయసు వారైతే వారికి మళ్లీ సేవ చేసేందుకు వేరే వాళ్లు అవసరం అవుతారు. స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు. కనుక సంసారాన్ని మోయలేదు. కష్టపడలేదు. పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబం యొక్క భారం స్త్రీ మీదే పడుతుంది. మగవాడిదే కుటుంబ భారమని చెప్పటానికే అనాదిగా ఈ ఆచారం.

అన్యోన్యత విషయంలో: భర్త వయసు భార్య వయసుకంటే ఎక్కువగా ఉండడం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సమ వయస్కులైతే ఇగో ప్రదర్శిస్తారు. ఎందుకంటే ఆలుమగల గొడవల్లో 20శాతం కారణం అహంకారమే..సంసారం విషయంలో: తన కన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంభోగం వలన పురుషునికి శక్తి తగ్గిపోతుందనేది అసత్యం. స్త్రీకి సిగ్గు ఎక్కువ. కనుక ప్రేమతోలాలించి, బుజ్జగించాలంటే తనకన్నా చిన్న వాళ్లు అయి ఉండాలి. మరణాన్ని జీర్ణించుకోలేరు: వృద్ధాప్యం కారణంగా ముందుగా భర్త చనిపోతే ఆ బాధను భార్య జీర్ణం చేసుకోగలదు. అతణ్ణి తల్చుకుంటూ శేష జీవితాన్ని గడపగలదు. అదే భర్త అయితే భార్య మరణాన్ని జీర్ణించుకోలేడు. మానసిక వేధన తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడే అవకాశం ఉంది. అందువల్లే భార్యకంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది మన పెద్దలు నియమం పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here