బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2 కి ఎన్ని తేడాలు ఉన్నాయో చూడండి

0
1064

అప్పట్లో యూరోప్ లో బిగ్ బ్రదర్ షో ప్రారంభం అయినప్పుడు అది కనివిని ఎరుగని సంచలనం రేపుతుందని ఎవరు ఊహించలేదు. బిగ్ బ్రదర్ ప్రారంభం అయినా తొలినాళ్లలో చాలా మందికి అలాంటి షో ఉందని కూడా తెలియలేదు. కాలక్రమంలో బిగ్ బ్రదర్ షో లో ఉన్న నాటకీయత , రియాలిటీ ప్రజలలోకి బాగా చొచ్చుకొని పోయాయి. పార్టీసిపెంట్స్ అందరు మన ముందు ఎలా బిహేవ్ చేస్తారో హౌస్ లోకూడా అలానే ప్రవర్తించడం అనేది ఆడియన్స్ కి కొత్తగా అనిపించింది. అప్పటి నుంచి బిగ్ బ్రదర్ ని ప్రతి ఇంట్లో కూడా విపరీతంగా ఆదరించడం మొదలు పెట్టారు.

ఆ తరువాత బిగ్ బ్రదర్ షో ఇండియాలో అడుగు పెట్టి బిగ్ బాస్ షో గా నామకరణం చేసుకుంది. మొదట్లో హిందీలో మాత్రమే వచ్చిన ఈ షో గత ఏడాది నుంచి ప్రాంతీయ భాషలలోకి కూడా ప్రసారం అవుతుంది. తెలుగులో వచ్చిన బిగ్ బాస్ 1 షో ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ తెలుగు బుల్లి తేరా రంగం ఫై ఎంతో ప్రభావం చూపింది. తెలుగు రియాలిటీ షో లకు కొత్త ఒరవడి చూపింది.

2017 లో ప్రసారమైన బిగ్ బాస్ 1 లో మొత్తం 14 మంది కంటిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బిగ్ బాస్ షోలలో 60 అత్యాధునిక కెమెరాలను ఫిక్స్ చేశారు. కానీ లేటెస్ట్ సీజన్ లో మరో 10 కెమెరాలను ఫిక్స్ చేసి చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా ఏర్పాటు చేశారు. అయితే తొలి సీజన్ కి రెండో సీజన్ కి కంటిస్టెంట్స్ విషయంలో మాత్రం మార్పు కనిపిస్తుంది. బిగ్ బాస్1 లో 14 మంది ఉండగా రెండో సీజన్ లో 16 మంది తో కంటిన్యూ చేస్తున్నారు.

జూన్ 10 నుంచి స్టార్ట్ అవుతున్న సెకండ్ సీజన్ ని 100 రోజుల పాటు కొనసాగించాలి అన్న నిర్ణయం వెనుక సీజన్ 1 సక్సెస్ ప్రధాన కారణంగా నిలుస్తుంది. బిగ్ బాస్ 1 ని 70 రోజుల పాటు నిర్వహించారు. ఆడియన్స్ ప్రతి రోజు ఒక పండగలా ఫీల్ అయ్యారు. టీ ఆర్ పి రేటింగ్స్ కూడా ఎవరు ఊహించనంతగా దూసుకు వెళ్లాయి. దాంతో ఈసారి మరో 30 రోజులు అదనంగా పెంచాలని ఫిక్స్ అయ్యింది బిగ్ బాస్ మేనేజ్మెంట్.

ఫస్ట్ సీజన్లో దాదాపు అన్ని రంగాలకు చెందిన కేవలం సెలెబ్రిటీలనే తీసుకున్నారు. ఈసారి కొంత మంది సామాన్యులకు కూడా అవకాశం ఇచ్చినట్టు బిగ్ బాస్ యాజమాన్యం తెలిపారు. దాంతో సాధారణ ప్రజానీకానికి కూడా బిగ్ బాస్ షూ ఫై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ సీజన్ లో మరో ముఖ్యమైన మార్పు ఏంటంటే ఈసారి బిగ్ బాస్ షో సెట్ హైద్రాబాద్ లోనే ఏర్పాటు చేశారు. మొదటి సీజన్ కోసం ముంబై సమీపంలోని లోన వాలాలో వేయడం తెలిసిందే.

సెకండ్ సీజన్ లో నేటివిటీ టచ్ ఇచ్చేందుకు గాను హైద్రాబాద్ లోని ప్రఖ్యాత అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ బిగ్ బాస్ షో సెట్టింగ్ నిర్వహించారు. ఇందుకోసం వందలాది మంది కార్మికులు నాలుగు నెలల పాటు శ్రమించారు. ఇక ప్రైజ్ మనీ విషయంలో బిగ్ బాస్ ఇతర షో ల కంటే చాలా ముందుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ సీజన్ లో విన్నర్ గా నిలిచినా టాలీవుడ్ నటుడు శివ బాలాజీకి ముందు అనౌన్స్ చేసినట్టుగానే 10 లక్షలు ఇచ్చారు. అంతే కాదు చివరి వరకు షోలో సక్సెస్ ఫుల్ గా కొనసాగినందుకు మరో 10 లక్షలు అదనంగా ముట్టింది.

ఇక హోస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా సెకండ్ సీజన్ కి మాత్రం అనూహ్యమైన రీతిలో న్యాచురల్ స్టార్ నాని ని సెలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది బిగ్ బాస్ యాజమాన్యం. నాని సామర్ధం ఫై ఎవరికీ సందేహాలు లేక పోయినా అందరు ఎన్టీఆర్ యే సెకండ్ సీజన్ ని కూడా నడిపిస్తారని భావించారు. కానీ కొత్త సినిమా కమిట్మెంట్లు ఎన్టీఆర్ ను బిగ్ బాస్ 2 కి దూరం చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here