బిగ్ బాస్ 2 ఎపిసోడ్ 10హైలైట్స్

0
1272

బిగ్ బాస్ 2…10వ ఎపిసోడ్ లో చాలా ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 9 వ రోజు మొదలవ్వగానే కెప్టెన్ సామ్రాట్ ఇంటిసభ్యులకు బిగ్ బాస్ హౌస్ లో కొన్ని చెయ్యవలసిన మరియు కొన్ని చెయ్యకూడని పనులను అందరికి వివరించారు. దానితరువాత మధ్యాహ్నం కొత్తగా వచ్చిన నందిని రాయ్ తన జీవితం లో జరిగిన అతి దారుణమైన సంఘటను ఇంటిసభ్యులైనా గీత మాధురి టీవీ9 యాంకర్ దీప్తి, భాను శ్రీ, శ్యామల మరియు రోల్ రైడా తో పంచుకుంది.

తాను 2016 లో గోవా ట్రిప్ కి వెళ్ళినప్పుడు బీచ్ లో అందరు ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ డ్రింక్ చేస్తున్నప్పుడు తన గ్లాస్ లో ఎవరో ఎదో వేశారని… అది త్రాగిన తరువాత తనకు బాడీ లో ఎం జరుగుతుందో తెలియక బీచ్ లోపలి వెళ్లి పోయానని.. నిజంగా నేను ఇంక చనిపోతానేమోనని అనిపించింది… ఆ తరువాత నన్ను మా ఫ్రెండ్స్ హైదరాబాద్ కు తీసుకొచ్చిన మూడు రోజుల తరువాత నేను కోమాలోనుండి బయటికి వచ్చాను అని నందిని చెప్పుకొచ్చింది.

ఆ విషయం తరువాత నేను మళ్ళీ మాములు మనిషిగా సస్టైన్ కావడానికి 2 సంవత్సరాలు పట్టింది. అందుకే 2 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నాను అని తన జీవితం లోని చేదు జ్ఞాపకాలను ఇంటి సభ్యులతో పంచుకోగా… వాళ్ళు ఆమె చెప్పిన దానికి బాధపడి… మీకు ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే మాలో ఎవరికైనా చెప్పండి అని చెప్పి… హౌస్ మేట్స్ ఆమెలో ధైర్యాన్ని నింపారు.

ఈ విషయం తరువాత బిగ్ బాస్ 2 లో రెండవ వారం “ఎవడ్రా రాజ్యాన్ని గెలిచేది” అనే లగ్జేరి బడ్జెట్ టాస్క్ ను బిగ్ బాస్ ఇంటి సభ్యలకు ఇచ్చారు. ఇందులో రాజుగా నూతన్ నాయుడు, రాణిగా టీవీ9 యాంకర్ దీప్తి, తిరుగుబాటు యువరాణిగా నందిని రాయ్, సంచాలకుడు గా గీత మాధురి ని బిగ్ బాస్ బాస్ ఎంపికచేశారు. మిగిలిన వారంతా గ్రామస్తులుగా ఉండి. రాజుగారు యువరాణిని మేపించడానికి గ్రామస్తులకు పెట్టిన పోటీలలో విజయం సాధించిన వారు రాజుగారి టీమ్ భాగమౌతారు అని బిగ్ బాస్ చెప్పారు. గ్రామస్తులుగా ఉన్న ఇంటి సభ్యలు ఎవరెవరు పోటీపడాలోకూడా బిగ్ బాసే నిర్ణయించారు.

మొదట దీప్తి సునైనా, గణేష్ ఇందులో పోటీపడగా గణేష్ టాస్క్ టైమ్ అయిపోయి సమయానికి యువరాణి కి ఎక్కువ పూలను ఇవ్వడం వలన విజేతగా నిలిచాడు. వీళ్లిద్దరి తరువాత తేజస్వి, భాను శ్రీ పోటీ పడగా.. వీళ్లకు ఇచ్చిన బురదలో కుస్తీ పోటీ టాస్క్ లో భాను శ్రీ విజయం సాధించింది రాజుగారి టీమ్ చేరింది. ఆ తరువాత అమిత్ మరియు కౌశల్ మధ్య పోటీలో బురద మట్టి ని చేతితో బకెట్ లో వెయ్యకుండా.. బట్టలకు మరియు ఒంటికి ఉన్న బురదను మాత్రమే చేతులతో తీసి బకెట్ లో వెయ్యాలి అని బిగ్ బాస్ రూల్ పెట్టారు.

అయితే ఈ రూల్స్ ని పాటించకుండా కౌశల్ బకెట్ మొత్తం బురద మట్టిని చేతులతో తీసి నింపేసాడు. మరోవైపు అమిత్ బిగ్ బాస్ చెప్పినా రూల్స్ ని పాటిస్తూ బకెట్ ని నింపాడు. ఇందులో చివరికి సంచాలకులు గా ఉన్న గీత మాధురి అమిత్ ని విజేతగా ప్రకటించింది. ఆమె నిర్ణయాన్ని కౌశల్ ఒప్పుకోకుండా గీత మధురితో కొంచంసేపు వాగ్వాదానికి దిగాడు. రాజుగారుగా ఉన్న నూతన్ నాయుడు కల్పించుకొని గీత మాధురి నిర్ణయంతో మేము ఏకీభవిస్తున్నాం అని అనడం తో కౌశల్ ఓటమిని ఒప్పుకోక తప్పలేదు. ఆ తరువాత కిరీటి దామరాజు మరియు రోల్ రైడా కి పెట్టిన పోటీలో కిరీటి విజయం సాధించి రాజుగారి టీమ్ లో చేరారు.

 

వీరిపోటీలు ముగిసేసరికి అర్ధరాత్రి అవ్వడంతో ఇంక మిగిలిన సామ్రాట్, తనీష్ పోటీ..
యాంకర్ శ్యామల, బాబు గోగినేని గారి మధ్య పోటీలు ఇవాళ జరగనున్నాయి. యువరాణిని ఆనందింపచేయడానికి అంటూ.. మొదలు పెట్టిన లగ్జేరి బడ్జెట్ టాస్క్ చివరికి బలప్రదర్శన గా మారింది. ఆలా బలప్రదర్శన గా మారడాన్ని బాబు గోగినేనిగారు తప్పుపడుతూ బిగ్ బాస్ ని తిడుతున్న ప్రోమోని “స్టార్ మా” రిలీజ్ చెయ్యడం వలన ఈ రోజు బాబు గోగినేని గారు బిగ్ బాస్ హౌస్ లో ఎం చేసారు అనే దాని గురించి అందరు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here