బిగ్ బాస్2 5వ ఎపిసోడ్ హైలైట్స్

0
1009

నిన్నటివరకు కొంత ప్రశాంతంగా సాగిన బిగ్ బాస్2 నాలుగవరోజు గొడవలతో ముగిసింది. 3 వరోజు బిగ్ బాస్ ఇచ్చిన లగ్జేరి బడ్జెక్ట్ టాస్క్ ని 4 వరోజు కూడా కొనసాగించారు ఇంటి సభ్యులు. అయితే సేవకుల టీమ్ లో ఉన్న దీప్తి సునైనా ని కిరీటి దామరాజు ఫ్లోర్ క్లీన్ చేస్తూ అమ్మ పాట పాడమని అడగగా దీప్తి సునైనా పాట పడుతూ కొంత సేపటికి ఏడ్చేసింది అందరు వచ్చి బ్రతిమిలాడి ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడగగా అసలు జరిగిన విషయం చెప్పింది.

 

తన టీమ్ లోని తేజస్వి ని “ఫ్లోర్ క్లీన్ చెయ్యడానికి చాట ఎక్కడ ఉంది అని అడిగితె తేజస్వి ఎదో ఎత్తి చూపించి ఇక్కడ ఉంది తీసుకో అని వెటకారంగా చెప్పింది అందుకే నాకు ఏడుపోచిందీ” అని దీప్తి సునైనా చెప్పింది. తరువాత ఈ విషయాన్ని తేజేస్వి కి చెప్తే… “నాకు టాస్క్ ఇచ్చారు కదా… నేను మాట్లాడకూడదు అందుకే అలా చెయ్యవలసి వచ్చింది” అని చెప్పడంతో ఒక గొడవ ముగిసింది.

కానీ లగ్జేరి బడ్జెక్ట్ టాస్క్ లో ఎక్కువ పాయింట్స్ కోసం పని అంతా తేజస్వి చేస్తుంది నాకు అవకాశం ఇవ్వరా అని సంజన గొడవపెట్టుకుంది. చివరికి తేజస్వి… వంట సంజననే చెయ్యమని చెప్పి కంప్రమైస్ అవ్వడం వలన ఇక్కడ మరో గొడవ ముగిసింది. ఈ గొడవ తరువాత సంజన తేజస్వి గురించి గీత మాధురి కి, కౌశల్ కి, భాను శ్రీ కి చెప్పి వాళ్ళ దగ్గర కూడా చాలా పెద్ద డ్రామా క్రియేట్ చేసింది.

అప్పటికే సంజన విషయంలో చాలా ఇరిటేషన్లతో ఉన్న తేజస్వి… సేవకుల టీమ్ కి యజమానులు టీమ్ ఇచ్చిన కోర్టు టాస్క్ లో మళ్ళి తేజస్వి ని, సంజన ని లాయర్ లుగా పెట్టారు యజమానుల టీమ్. ఈ కోర్టు టాస్క్ జరిగినంత సేపు సంజన తనను ఎంత డామినేట్ చెయ్యాలి అని చుసిన కామ్ గా ఉండి. టాస్క్ అయిపోయిన తరువాత టాస్క్ ఎవరు డిజైన్ చేసారు అని తెలుసుకొని… ఆలా చేపించిన నూతన్ నాయుడు పై కోప్పడింది. కొంచం సేపు ఎవరితో మాట్లాడకుండా బాగా ఎమోషనల్ అయిపొయింది తేజస్వి. ఈ విషయంతో నూతన్ నాయుడు ని అందరు విలన్ ని చూసినట్లు చూసారు.

ఆ తరువాత బిగ్ బాస్ తేజస్వి ని పిలిచి ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తూ అందులో బిగ్ బాస్ చెప్పినవి అన్ని చేస్తే కెప్టెన్ రేస్ లో నువ్వు ఉంటావు అని చెప్పడం జరిగింది. అయితే బిగ్ బాస్ చెప్పిన ఒక్క పనిని కూడా తేజస్వి చెయ్యలేక పోతుంది.

రాత్రి అయ్యే సమయానికి నూతన్ గేమ్ ఆడుతున్నాడు. అతను అతనిలా లేడు అంటూ అందరు అతనిపై గొడవ పెట్టుకున్నారు. నూతన్ నాయుడు 3 రోజుల నుండి మంచిగా గేమ్ ఆడుతున్నాడు అని కిరీటి అందరికి ప్రచారం చేసి అతనిని బాడ్ చెయ్యాలని ప్రయత్నించాడు. ఎందుకంటే కిరీటి దామరాజు కూడా ఎలిమినేషన్ రేస్ లో ఉన్నాడు కాబట్టి కిరీటి కూడా పక్క ప్లాన్ తో గేమ్ ఆడుతున్నాడు అని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి అర్థమైపోయింది. అలా 4 వరోజు ముగిసే సమయానికి కిరీటి దామరాజు ఒంటరిగా మిగిలిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here