బిగ్ బాస్ 2 ఎపిసోడ్ 6 హైలైట్స్

0
950

బిగ్ బాస్2 లో 4 వ రోజు గొడవలతో ముగియగా 5 వ రోజు మాత్రం చాలా చప్పగా సాగింది అనే చెప్పొచ్చు. అయితే కొన్ని ఆకట్టుకొనే అంశాలు కూడా చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ హౌస్ కి తోలి కెప్టెన్ ని ఎన్నుకోడం, లగ్జేరి బడ్జెట్ ట్రస్ట్ లో అందరు బాగా పర్ఫార్మ్ చేసినందుకు గాను లగ్జేరి బడ్జెట్ ను ఇంటి సభ్యులకు అందజెయ్యడం వంటివి 5 వ రోజు ఆసక్తి కరంగా కనిపించాయి.

 

షో మొదలైనప్పటినుండి బిగ్ బాస్ లోని ఇంటి సభ్యులు ఆదివారం ఎలిమిషన్ గురించే మాట్లాడుకున్నారు. ఇక అందాల ఐస్ క్రీమ్ బ్యూటీ తేజస్వి బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే బుల్లి బుల్లి నిక్కర్లు షార్ట్ టాప్ లతో హీట్ పుట్టిస్తూ తనదైన శైలి పెర్ఫార్మన్స్ ఇస్తుండగా.. 5 వ రోజు స్విమ్ సూట్ లో దర్శనమిచ్చింది. బిగ్ బాస్ హౌస్ స్విమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడుతూ సేదతీరింది.

ఇక కీలకమైన బిగ్ బాస్ తొలి కెప్టెన్ కోసం 16 మంది సభ్యుల మధ్య నామినేషన్స్ జరిగాయి. 2వ రోజు జరిగిన టాస్క్ లో సామ్రాట్ కి కెప్టెన్ అభ్యర్థికి పోటీదారునిగా ఉండడానికి లక్కీ కార్డు రావడం వలన… సామ్రాట్ తో పాటు మరో ముగ్గురిని ఇంటి సభ్యులు ఎంపిక చెయ్యవలసింది గా బిగ్ బాస్ కోరాడు. అందుకుగాను కామన్ మాన్ గణేష్, సంజన, భాను శ్రీ ఎంపికయ్యారు. వీళ్ళ నలుగురికి బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇవ్వగా.. అందులో సామ్రాట్ విజయం సాధించి బిగ్ బాస్2 హౌస్ కి తొలి కెప్టెన్ గా కెప్టెన్ బెడ్ రూంలోకి వెళ్ళాడు.

అంతకు ముందు లగ్జేరి బడ్జెక్టు గెలిచినందుకు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కొన్ని పాయింట్స్ ఇచ్చి వాటితో మీకు కావలసినవి రాయాల్సిందిగా కోరాడు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు అందరు కలిసి ఎవరికీ ఏంకావాలో వాటిని ఒక బోర్డు పై రాసి స్టోర్ రూమ్ లో పెట్టారు.

అయితే 5 వరోజు మాత్రం బిగ్ బాస్ హౌస్ లో జరిగిన విషయాలు ఏవి ఆకట్టులోలేక పోగా చూస్తున్న వారికీ చిరాకును తెపించింది. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ లో అందరు ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని సామ్రాట్ కి ఎక్కువ పాయింట్స్ ఇచ్చారు. నిజానికి ఆ కెప్టెన్సీ టాస్క్ లో సామ్రాట్ కన్నా గణేష్, భాను శ్రీ నే బాగా చేసారని చెప్పాలి. గణేష్ చేసిన జిమ్ కి సంభందించిన యాడ్ తో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారిని… టీవీ చూస్తన్నావారిని బాగా ఎంటర్టైన్ చేసాడు.

అలాగే భాను కూడా తన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది. సంజన సబ్బుల యాడ్ అంతగా ఆకట్టుకోలేదు. చెక్లెట్ ను అసలు ఇలాకూడా ప్రమోట్ చేస్తారా అని అనిపించింది సామ్రాట్ చేసిన యాడ్ చూసినతరువాత . కానీ చివరికి సామ్రాట్ కి పోయింట్స్ ఎక్కువ రావడంతో సామ్రాట్ కెప్టెన్ అయ్యాడు.

బిగ్ బాస్ హౌస్ లో అప్పుడే గ్రూప్ లు కట్టడం కూడా మొదలైపోయింది. తేజస్వి, తనీష్, సామ్రాట్ ముగ్గురు కలిసి ఈ వారం ఎవరు ఎలిమినేటి అవుతారు అనే అనే దాని గురించి చేర్చించారు. అదీకాకుండా వీళ్ళు బిగ్ బాస్ హౌస్ ని రూల్ చెయ్యడానికి ట్రై చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here