బిగ్ బాస్ 2 ఎపిసోడ్ 8 హైలైట్స్

0
1070

శనివారం రోజు జరిగిన బిగ్ బాగ్ బాస్ షో కంటే 7 వ రోజు ఆదివారం జరిగిన షో బాగా ఆకట్టుకుందని చెప్పాలి… నాని యాంకరింగ్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇంతకూ ముందు రెండు ఎపిసోడ్ లతో పోల్చుకుంటే నాని చాలా మెచూర్డ్ గా షో ని నడిపించారు. అయితే ఆదివారం ఫాథర్స్ డే సందర్భంగా అందరికి సర్ప్రైస్ ఇవ్వడం, సంజన ఎలిమినేషన్ మరియు ఆఖరిలో కొత్త హౌస్ మీట్ నందిని ఇంట్రడ్యూస్ చెయ్యడం వంటివి హైలైట్స్ గా చెప్పుకోవచ్చు.

ముందు శనివారం ఎపిసోడ్ అమిత్ వరకు వచ్చి ఆగిపోయింది. మళ్ళీ ఈ రోజు అమిత్ తోనే మొదలైంది. శనివారం ఎపిసోడ్ లో చాలా మందికి కొన్ని డైలాగ్స్ వచ్చాయి.. ఆ డైలాగ్స్ ని వారు ఎంచుకున్నవారి చెప్పారు. మరి ఈ రోజు కూడా అమిత్ కి ఒక డైలాగ్ వచ్చింది. ఆ డైలాగ్ ఏంటంటే “నేను పైకి కనిపించేంత మంచోడిని మాత్రం కాదు ” ఆ డైలాగ్ ను భాను శ్రీ దగ్గరకు వెళ్లి చెప్పి అందరికి నవ్వు వచ్చేలా చేసారు. అలా మొత్తంగా అందరికి ఒక్కో డైలాగ్ వారివారికి నచ్చిన లేక కోపంగా ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి చెప్పడం ముగిసి పోయిన తరువాత నాని అందరికి ఒక సర్ప్రైస్ ఇచ్చాడు.

అదేంటంటే ఆదివారం ఫాథర్స్ డే సందర్భంగా బిగ్ బాస్ లో ఉన్న 16 మంది ఫాథర్స్ ఫోటోలను తెప్పించి వారికీ ఎవరికీ తెలియకుండా సస్పెన్సు గా ఉంచారు. ఆ కవర్లలో వాళ్ళ నాన్న ఫోటోలను ఉంచి నాని ఓపెన్ చెయ్యమన్నపుడు ఓపెన్ చెయ్యగా నాని వాళ్లందరికీ ఒకేసారి ఫాథర్స్ డే విషెస్ చెప్పడం జరిగింది. అందులో కొంతమంది వాళ్ళ ఫాథర్స్ ఫొటోస్ చూసు కుంటూ బాగా ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా తనీష్, శ్యామల, టీవీ9 యాంకర్ దీప్తి , దీప్తి సునైనా బాగా ఎమోషనల్ అయిపోయారు.

మొదట తనీష్ చనిపోయిన వాళ్ళ నాన్నను గుర్తు చేసుకొని ఏడ్చేశాడు. నాని కూడా తనీష్ విషయం లో సారీ చెప్పాడు. తనీష్ ని వాళ్ళ నాన్న ఎలా పైకి తీసుకొచ్చాడో నేను దగ్గరనుండి చూసాను అని నాని అన్నారు. యాంకర్ శ్యామల కూడా కూడా తన నాన్న గురించి తలుచుకొని ఏడిచేసింది. నా తండ్రి చిన్నతనం లోనే చనిపోయారు. బిగ్ బాస్ టీమ్ పంపించిన ఫోటో లో ఉన్నా అతను మా భర్త మేనమా… ఆయనే నన్ను దత్తతు తీసుకోని నాకు పెళ్ళి చేసారు అని శ్యామల చెప్పుకొచ్చింది. దీప్తి సునైనా కూడా తన డాడీ ని చాలా మిస్ అవుతున్నాను అని… నేను ఇండిపెండెట్ గా ఉండగలను అని నిరూపించడానికి బిగ్ బాస్ కి వచ్చాను అని చెప్పింది. ఇక టీవీ9 యాంకర్ తనకు వాళ్ళ నాన్న జీవితం లో 3 విషయాలను గుర్తుపెట్టుకో అని చెప్పారు అని… వాటిని నేను ఎప్పటికి మరచిపోను అని చెప్పుకొచ్చింది.

దీనితరువాత బిగ్ బాస్ ఎలిమినేషన్ లో చివరికి నూతన్ నాయుడు మరియు సంజన మిగలగా… నూతన నాయుడు ని స్టోర్ రూమ్ లోకి సంజనని కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లామన్నారు. నాని హౌస్ మీట్స్ కి కన్ఫెషన్ రూమ్ లో ఉన్నవారు ఎలిమినేట్ అవ్వలేదు వెళ్లి తీసుకురండి అనగా… అందరు నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యారు అని అనుకున్నారు కానీ కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లి చుస్తే నూతన్ నాయుడు ఉన్నారు. దింతో ఇంటి సభ్యులందరు ఆశ్చర్యానికి గురయ్యారు. అలా చివరికి సంజనను స్టాగ్ మీదకు పిలిచి నాని చివరిగా వీడ్కోలు పలికారు. సంజన వెళ్తూ బిగ్ బాంబు ను బాబు గోగినేని గారి మీద వేసింది. ఈ బిగ్ బాంబు తో ఇంటి సభ్యులకు ఎవరికీ వాటర్ కావాల్సివచ్చిన బాబు గోగినేని గారే పట్టి ఇవ్వాలి.

సంజన ఎలిమినేషన్ తరువాత షో అయిపొయింది అనుకున్నారు అందరు కానీ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ బిగ్ బాస్ 2 షో లోకి కొత్త కంటెస్టెంట్ నందిని రాయ్ ( Nandini Rai ) ని నాని ఇంట్రడ్యూస్ చేసారు . నిజానికి ఈమె బిగ్ బాస్2 మొదలయ్యే రోజే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఉండాలి కానీ ఈమెకు అనుకోకుండా ఆక్సిడెంట్ అవ్వడంతో ఈ వారం ఆమెను బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here