బిగ్ బాస్ 2 ఎపిసోడ్ 9 హైలైట్స్

0
1559

బిగ్ బాస్ ఫస్ట్ ఎలిమినేషన్ పూర్తయింది. బిగ్ బాస్ హౌస్ నుండి సంజన బయటికివచ్చింది. ఆమె చేసిన అతివలనే ప్రేక్షకులు ఇంటినుండి పంపించేశారు. సాధారణ కంటెస్టెంట్ లా బిగ్ బాస్2 లో ఎంట్రీ ఇచ్చిన సంజన సెలెబ్రెటీల ఇంట్లో ప్రవర్తిచడం వలన అందరికి చిరాకు వచ్చేసింది. మొదటిరోజే జైలు లో పడడం. దానికి కారణం అయిన వారితో గొడవకు దిగడం తేజస్వి, బాబు గోగినేని లను టార్గెట్ చేసి రచ్చచేయ్యడం ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. తినితో ఆమెను ఆదివారం ఇంటినుండి పంపించేశారు.

9 వ ఎపిసోడ్ లో ఆదివారం షో అయిపోయిన తరువాత నైట్ ఎం జరిగిందో చూపించారు. సంజన వెళ్తూ బిగ్ బాంబును బాబు గోగినేని గారు మీద వెయ్యడం వలన అయన వాటర్ పడుతూ నేను ఈ ఛాలెంజ్ ని తీసుకుంటున్న వాటర్ పట్టి అందరికి ఇవ్వడాన్ని నేను ఎం టాస్క్ లా ఫీల్ అవ్వడం లేదు అని చెప్పారు. నైట్ అందరు పడుకున్న తరువాత దీప్తి సునైనా పిల్లి గెటప్ వేసుకొని నిద్రపోతున్నవారిని భయపెట్టడానికి ట్రై చేసింది.

ఇక తరువాతి రోజు మొదలైన దగ్గరనుండి అందరు ఎలిమినేషన్స్ గురించే మాట్లాడుకున్నారు. బాబు గోగినేని గారు ఉదయం నుండి వాటర్ ని బాటిల్స్ లో నిప్పుతూనే వున్నారు. కొంత సేపటికి నూతన్ నాయుడు, బాబు గోగినేని గారికి చెప్పకుండా వాటర్ ఫిల్టర్ దగ్గరకు వెళ్లి వాటర్ పట్టుకోవడం వలన బిగ్ బాంబు నూతన్ నాయుడు మీదకు షిఫ్ట్ అయింది.

ఇక మధ్యాహ్నం నుండి బిగ్ బాస్ 2 రెండవ ఎలిమినేషన్ కు నామినేషన్స్ జరిగాయి. హౌస్ మేట్స్ కి ఎలిమినేట్ చెయ్యాలనుకున్న వారిని పేర్లను చెప్పవలసిందిగా బిగ్ బాస్ సూచించారు. అయితే బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అవ్వడం వలన సామ్రాట్ ఈ ఎలిమినేషన్ నుండి సురక్షితుడు అయ్యారు. అదికాక కెప్టెన్ అయినందువలన బిగ్ బాస్ ఒక వ్యక్తి ని డైరెక్టుగా ఎలిమినేషన్ కి నామినెటే చేయవలసిందిగా బిగ్ బాస్ కోరడం వలన… సామ్రాట్ చాలా సమయం తరువాత దీప్తి సునైనా పేరును చెప్పాడు. తరువాత బిగ్ బాస్ ఇంటిసభ్యులు కు కెప్టెన్ అయినందువలన సామ్రాట్ పేరు ను ఎలిమినేషన్ కి చెప్పకూడదు అలాగే దీప్తి సునైనా పేరు ని సామ్రాట్ డైరెక్ట్ గా ఎమిలినషన్ కి నామినెటే చెయ్యడం వలన దీప్తి సునైనా పేరు ను చెప్పకూడదు అని చెప్పి ఇద్దరి చొప్పున కాంఫిషన్ రూమ్ లో కి పిలిచి ఏకాభిప్రాయంతో 2 పేర్లను నామినెటే చేయవలసిందిగా బిగ్ బాస్ కోరాడు.

అయితే ఎక్కడ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరికి సరిగ్గా పడదో వారిద్దరిని ఒక పెయిర్ గా పిలిచి బిగ్ బాస్ ఎలిమినేషన్ కి నామినేషన్స్ జరిపించారు. హౌస్ మేట్స్ ను నామినెటే చేసే సమయంలో కాన్ఫిషన్ రూమ్ లో ఆసక్తికరం వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా కౌశల్ గురించి భాను శ్రీ పై చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరం. కౌశల్ అమ్మాయిలపై చేతులు వేసి మాట్లాడడం నాకు నచ్చలేదు.. అమ్మాయిలను టచ్ చెయ్యకుండా మాట్లాడాడు. చెయ్యి వేసినప్పుడు ఏయే.. చేయితీయి అని చెప్పడం బాగుండదు కాబట్టి అనడం లేదు. అందుకే అతని పేరును నామినెటే చేస్తున్నాను అని భానుశ్రీ మండిపడింది. అలాగే దీప్తి సునైనా కూడా కౌశల్ పేరును నామినెటే చేసింది. తాను పిల్లి వేషం వేసినప్పుడు తనను చేతులపై ఎత్తుకెళ్లాడని అది తనకు నచ్చలేదు అని చెప్పుకొచ్చింది. తన సొంత బ్రదర్ ని అయినా కూడా ఆలా చెయ్యనివ్వను అని తేల్చి చెప్పింది. మిగిలిన వారంతా సాధారణ కారాలనతోనే హౌసెమెట్స్ ను ఎలిమినేషన్ కు నామినెటే చేసారు. అయితే ఈ నామినేషన్స్ లో నూతన నాయుడు , కౌశల్, గణేష్, బాబు గోగినేని గారితో పాటు దీప్తి సునైనా కూడా ఈ వారం ఎలిమినేషన్ రేస్ లో ఉన్నారు.

బిగ్ బాస్ రెండవ ఎలిమినేషన్ కి నామినేషన్ పూర్తీ అయినా కొంత సేపటికి, బిగ్ బాస్ ఇంట్లో పోస్ట్ బాక్స్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ అవుతున్న నందిని రాయ్ గురించి ఒక సామెతలా ఒక లెటర్ ని పంపారు. దానిని భాను శ్రీ చదివి అందరికి వినిపించింది. ఆ లెటర్లో ఏముందంటే… చందమామ అంత ప్రశాంతమైనది… రింగ్ రోడ్ అంట చక్కనైనది… కత్తి అంత పదునైనది… రూబిక్స్ క్యూబ్ అంట గజిబిజి అయినది.. స్మూతీ.. అంట స్మూత్ అయినది… మిరపకాయ్ అంట ఘాటైనది… మీకోసం ఇలాంటి అద్భుతమైన సర్ప్రైస్ వస్తుంది అదేంటో చెప్పగలరా.. అని ఆ లెటర్ లో ఉంది. ఈ లెటర్ చదవడం పూర్తీ అవ్వగానే చాల మంది వైల్డ్ కార్డు ఎంట్రీ అనే భావించారు.

అయితే నందిని ఎంట్రీకి తమన్నా సాంగ్ ప్లే చెయ్యడంతో తమన్నా వస్తుందేమోనని చాలా మంది సందేహ పడ్డారు. తరువాత నందిని రాయ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయినా తరువాత ఇంటిసభ్యులు అందరు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. నందిని బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయినా కొదిసేపటినుండే… ఇంటి సభ్యులందరితో బయట ఏమనుకుంటున్నారు అని అడిగి తెలుసుకున్నారు. బిగ్ బాస్ షో మొత్తం లో దీప్తి సునైనా హైలైట్ అని ఆమె ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఎడినప్పుడు దీప్తి సునైనా ను ఎవరైతే ట్రోల్ చేసారో అప్పటినుండి అందరు సపోర్ట్ చెయ్యడం మొదలు పెట్టారు అని నందిని చెప్పింది. లేడీస్ జాగ్రత్త కౌశల్ is here అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారని నందిని చెప్పి నవ్వు కున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here