బిగ్ బాస్ 2 లో ఎంటరైన దీప్తి సునైనా గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు

0
1263

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం రాత్రి 9 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదటి సీజన్ సూపర్ హిట్ కావడం.. మంచి ఎంటర్ టైన్ మెంట్ అందించడం.. సెకండ్ సీజన్ పై అంచనాలు పెరిగాయి. ఎన్టీఆర్ స్థానంలో నాని ఎంట్రీ ఇవ్వడం ఈసారి షో ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. 16మంది కంటెస్టెంట్లతో 106 రోజుల పాటు ఈ షో సాగబోతోంది. గత సీజన్ కంటే మరింత మసాలా దట్టించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

ఇప్పటి యువతరం కొత్త కొత్త ఆలోచనలు తమకి నచ్చిన మార్గంలో పలువురు మెచ్చే విధంగా దూసుకు పోతున్నారు. అంతే కాదు లక్షల్లో ఆదాయం ఆర్జిస్తూ ఇతర యువతీ యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో దీప్తి సునైనా గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఈ 20 ఏళ్ల అమ్మాయి ఓ ఇంటర్నెట్ సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. ఆమె డబ్ ష్మ్యాష్ వీడియోలకు ఎంత పాపులారిటీ ఉందొ ఊహించలేరు. దీప్తి సునైనా ను అందరు ఇంస్ట్రాగ్రామ్ క్వీన్ అని పిలుస్తారు. దీప్తి సునైనా అసలు పేరు దీప్తి రెడ్డి. అయితే ట్రెండీ గా ఉండేందుకు తన పేరు లో సునైనా చేర్చుకుంది.

హైద్రాబాద్ లోనో ఖర్మానిఘాట్ ఆమె స్వస్థలం. 1998 లో జన్మించింది. మెహిదీపట్నం నుంచి సెయింట్ ఆన్స్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది దీప్తి. అయితే లైఫ్ లో ఎదో కొత్తగా సాధించాలన్న తపనతో డబ్ ష్మ్యాష్ లో డాన్స్ రూపంలో కొన్ని వీడియోలు రూపొందించింది. అయితే ఆ వీడియోలలో కొత్తదనం కనిపించడంతో నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఆమె సోషల్ మీడియా అకౌంట్ లలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్మడి టాలెంట్ ఏంటో ఇట్టే అర్ధం అవుతుంది .

ప్రస్తుతం వైజాగ్ కుర్రాడు షణ్ముఖ్ జైశ్వంత్ తో కలిసి సంయుక్తంగా వీడియోలు రూపొందిస్తుంది. వీరిద్దరి జాయింట్ ప్రొడక్షన్ లో వచ్చిన గువ్వా గోరింకా ఆన్లైన్ లో అదిరి పోయే రేంజ్ లో హిట్ అయ్యింది. ఆమె కి మోడలింగ్ అవకాశాలు కూడా వెళ్లు వెత్తుతున్నాయి. అయితే ఈ మధ్య ఆమె నటించిన సీత ఐ యామ్ నాట్ ఏ వర్జిన్ అనే షార్ట్ ఫిల్మ్ వివాదాలలో చిక్కుకుంది.

ప్రస్తుతం దీప్తి కెరియర్ మరింత ఊపందుకునే విధంగా బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంపికైంది. మొత్తం 16 మంది కంటిస్టెంట్స్ లో ఆమె కూడా ఉంది. ఇప్పటికే ఇంటర్నెట్ రంగంలో సంచలనం రేపుతున్న ఈ చలాకి అమ్మాయి బిగ్ బాస్ షో తరువాత సినీ రంగంలో కూడా అవకాశాలు డాకించుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here