గూఢచారి మూవీ రివ్యూ

0
1122

క్యారెక్టర్ రోల్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అడవి శేష్ ఒక్కో చిత్రంతో తన సత్తా చాటుకుంటూ వచ్చాడు. హీరోగా నటించిన క్షణం చిత్రం అడవి శేష్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇప్పటికి అడవి శేష్ ని చిన్న హీరోగానే పరిగణించాలి. గూఢచారి చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ టీజర్ ట్రైలర్ విడుదలయ్యాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. యాక్షన్ ప్రియులంతా ఈ చిత్రం కోసం ఎదురుచూసారు. ఆ రోజు రానే వచ్చింది. మరి గూఢచారి ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అన్నది మన సమీక్షలో చూద్దాం.

1995 లో దేశం కోసం మరణించిన “గోపి (అడివి శేష్)” తండ్రిని చూపిస్తూ ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అప్పటినుండి గోపి అలియాస్ అర్జున్ కూడా ఆర్మీలో చేరాలి అనుకుంటాడు. ఎన్నో ప్రయత్నాలు చేసాడు కానీ ఫెయిల్ అయ్యాడు. చివరికి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న “త్రినేత్ర” అనే సీక్రెట్ ఏజెన్సీ గోపికి ఉద్యోగం ఇస్తుంది. ఇంతలో అసోసియేషన్ లో కొన్ని అవకతవకలు జరుగుతాయి. ఇంటర్వెల్ సీన్ దగ్గర విలన్ ను రివీల్ చేస్తారు. దుండగులను పట్టుకునే ప్రయత్నంలో ఉంటాడు గోపి. ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో చిట్టగాంగ్ కి వెళ్తాడు గోపి. అక్కడ తన లైఫ్ కి సంబందించిన ఒక ట్విస్ట్ ఎదురవుతుంది. క్లైమాక్స్ లో వచ్చే ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే!

క్షణం’ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ‘గూఢచారి’. సొంతంగా రాసుకున్న కథతో ఈసారి పాజిటివ్ బజ్‌తో థియేటర్స్ వస్తున్నాడు అడవి శేష్. ఒక సాధారణ కాలేజ్ స్టూడెంట్ గూఢచారిగా మారితే ఎలా ఉంటుంది అన్న జెన్యూన్ కాన్సెప్ట్‌ను థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు దర్శకుడు శశి కిరణ్ తిక్కా. టేకింగ్, మేకింగ్ పరంగా హాలీవుడ్ చిత్రాలకి ధీటుగా హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రంపై తొలి నుండి భారీ అంచనాలే ఉన్నాయి. హీరో తండ్రి ఒక యాక్షన్ సీక్వెన్స్ లోచనిపోతాడు..అతడు గొప్ప గూఢచారి. తండ్రిబాటలోనే వెళ్లాలనుకున్న ఓ యువకుడికి అడుగగునా వచ్చే కష్టాలు ఎలా ఎదుర్కొన్నాడన్న విషయం దర్శకుడు అద్భుతంగా చూపించాడు.

ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ్ల హీరోయిన్‌గా నటించింది.టేకింగ్, మేకింగ్ పరంగా హాలీవుడ్ చిత్రాలకి ధీటుగా హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రంపై తొలి నుండి భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సుప్రియ, రవిప్రకాష్ లాంటి పవర్ క్యాస్టింగ్ ఉండటంతో బిజినెస్ పరంగా ఈ చిత్రానికి అన్ని ఏరియాలనుండి భారీ ఆఫర్స్ వచ్చాయి. అడవి శేష్ తన పాత్రకు తగిన న్యాయం చేసాడు. ఎమోషనల్ గా సాగిన క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్. జై హింద్ అనడంతో ఈ సినిమా ఎండ్ అవుతుంది.

ఇంటిలీజేన్స్ విభాగంలో ఉన్న హీరో..ఉగ్రవాదుల రహస్యాలు తెలుసుకోవడానికి వెళ్లి చిక్కుల్లో పడంటం..అదే ఇంటిలీజెన్స్ విభాగం హీరోని టార్గెట్ చేయడం చాలా బాగా చూపించారు. చాలా గ్యాప్ తరువాత హీరో సుమంత్ అక్క సుప్రియ రా ఆఫీసర్ గా బాగా నటించింది. స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్, రా ఆఫిసర్ గా కామెడీ అద్భుతంగా పండించాడు. నటి మధు షాలిని తన నటనకు తగ్గట్టుగానే నటించింది. అప్ కమింగ్ టెర్రరిస్టుల గురించి తెలుసుకోవడం.. ‘త్రినేత్ర’ ఏజెన్సీ మెంబెర్స్ కి కొత్త కోడ్ లను ఎలా ఢీ కోడ్ చేశారు అన్నది కొత్తరకంగా చూపించారు. మొత్తానికి సినిమా మూడ్ సినిమా జానర్ కి బాగా సరిపోయింది… అయితే ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం సినిమాకి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. సినిమా క్లయిమాక్స్ లో రా ఏజంట్లు శేష్ ఒరిజినల్ ఐడెంటిటీ ని ఎలా రివీల్ చేశారన్నది తప్పకుండా చూడాల్సిన అంశం. ఏది ఏమైనా గూఢచారి ఇక థ్రిల్లర్, అడ్వంచర్ లాంటి సినిమా అనే చెప్పొచ్చు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here