కౌశల్ ఆర్మీ వార్ రివర్స్. స్పందించిన కౌశల్…

0
250

బిగ్ బాస్ సీజన్-2 విన్నర్ కౌశల్ ఆయన పేరు మీదున్న ఆర్మీ వల్ల బాగా పాపులర్ అయ్యాడు. “కౌశల్ ఆర్మీ” కౌశల్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక్క మాటన్నా, గొడవ పడినా. వాళ్లను ఎలిమినేట్ చేసేవరకు నిద్రపోయేవారు కాదు. అలాంటి కౌశల్ ఆర్మీ ఇప్పుడు అకస్మాత్తుగా కౌశల్ ఆర్మీ స్వయంగా కౌశల్ పై నెగెటివ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

కౌశల్ కు డబ్బు పిచ్చి ఉందని, డబ్బు లేకపోతే అభిమానులను కూడా పట్టించుకోడని, కౌశల్ ఎక్కడికి వెళ్లినా ఖర్చును మాత్రం కౌశల్ ఆర్మీనే భరించాల్సి వచ్చేదని, అభిమానులు తమ డబ్బులతోనే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేవారని చెప్పారు ఇమామ్. అంతేకాదు బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బును ఫౌండేషన్ కు వినియోగిస్తానని కౌశల్ చెప్పిన మాటలు అబద్ధమని, ఇలాంటి వ్యక్తి సొసైటీకి చాలా ప్రమాదకరమని మండిపడ్డారు.

వీరి వ్యాఖ్యలపై స్పందించాడు కౌశల్. తనపై వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని, ఇటువంటి చెత్తపై మాట్లాడే ఇంటరెస్ట్ తనకు లేదని, ఇలాంటి నిరాధారమైన విషయాలపై స్పందిస్తే తనను మరింత తగ్గించాలని చూస్తారని, బిగ్ బాస్ హౌస్ లో నేనెలా ఉన్నానో. నిజ జీవితంలో కూడా అలాగే ఉంటానని వివరణ ఇచ్చారు. ఎవరో కొందరు చేసే ఆరోపణలు తన స్థాయిని తగ్గించలేవని, కాలం గడిచే కొద్ది అన్ని విషయాలకు సమాధానం దొరుకుతుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here