రాంగ్ కాల్ చేస్తే, స్వీట్ వాయిస్ హాయ్ చెప్పింది.. కుర్రాడు దెబ్బయిపోయాడు! ఎలానో చూడండి..

0
2483

పదిహేనేళ్ల కుర్రాడు పొరబాటున ఓ నంబర్‌కు ఫోన్ చేశాడు. రాంగ్ నంబర్ అని తెలిసింది, కానీ అవతలివైపు తీయటి స్వరం వినిపించడంతో మైమర్చిపోయాడు. ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలనుకున్నాడు. ఇక రోజూ ఏదో ఒక వంకతో ఆమెకు ఫోన్ చేసేవాడు. మెల్లగా ఆమెను బుట్టలో వేసుకున్నాడు. ఫోన్ సంభాషణ ద్వారానే ఇద్దరూ సన్నిహితులయ్యారు. ఆ అబ్బాయి అయితే ఆమెను విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నాడు. ఇక ఆమెను చూడాల్సిందే.. అని డిసైడైపోయాడు. వెంటనే బ్రహ్మపుత్రా నదిని దాటేసి ఆమె ఉన్న ఊరెళ్లాడు.

కానీ తన ప్రేయసిని చూడగానే షాకయ్యాడు. ఫోన్లో తీయగా మాట్లాడిన ఆమె టీనేజర్ కాదు, 60 ఏళ్ల బామ్మ అని తెలిసి బిత్తరపోయాడు. ఇంకా షాకింగ్ ఏంటంటే.. ఇరుగు పొరుగు కలిసి ఒంటరిగా ఉంటున్న ఆ బామ్మతో ఆ కుర్రాడికి బలవంతంగా పెళ్లి చేశారు. విచిత్రం ఏంటంటే ఆ పెళ్లి బామ్మకు కూడా ఇష్టం లేదట. ఆ అబ్బాయి నాతో మాట్లాడిన విధానం నచ్చింది. అందుకే అతడితో ఫోన్లో మాట్లాడా, అంతేకానీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని చెబుతోంది. మనకేమో ఫన్నీగా, ఆ కుర్రాడికేమో చీ దీనమ్మ జీవితం.. అనిపించేలా జరిగిన ఈ ఘటన అసోంలో చోటు చేసుకుంది. గోల్‌పారాకు చెందిన ఆ కుర్రాడు స్కూట్ డ్రాపౌట్. తాపీ పని చేసుకుంటూ జీవించేవాడు. అతడి ప్రియురాలేమో బార్‌పేట జిల్లాలోని సుఖువాఝార్. అందమైన అమ్మాయిని లైన్లో పెట్టాననుకొని బ్రహ్మపుత్ర నదిని దాటి వెళ్లిన ఆ కుర్రాడికి 60 ఏళ్ల బామ్మతో పెళ్లయ్యింది పాపం.

ఈ వార్త తెలిసిన గౌహతికి చెందిన ఓ చైల్డ్ లైన్ ఎన్జీవో.. పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆ పిల్లాడు మైనర్ అని తేలితే చట్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కమిషన్ తెలిపింది. అందుకే ఫోన్లో స్వీట్ వాయిస్ వినగానే సొల్లు కార్చుకోవడం కాదు.. అమ్మాయిని పడేశానోచ్ అని సంబరపడిపోవడం కాదు.. రాంగ్ నంబర్‌కు కాల్ చేస్తే దాన్ని అంతటితో వదిలేయాలి. ఒళ్లు దగ్గర పెట్టుకొని పద్ధతిగా ప్రవర్తించాలి. లేదంటే మనం కూడా ఏ గోదావరో, కృష్ణా నదో దాటెళ్లి మోసపోవాల్సి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here