హీరోయిన్ లయ తనపై వచ్చిన కథనాలపై షాకింగ్ కామెంట్స్

0
261

తెలుగులో స్వయంవరం మూవీతో హీరోయిన్ గా పరిచయం అయిన హీరోయిన్ లయ పలు చిత్రాల్లో నటించి, కేరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని యుఎస్ లో సెటిల్ అయింది. ఇటీవల అమెరికాలో అమర్ అక్బర్ ఆంటోని మూవీలో కూతురు శ్లోకతో కల్సి ఓ చిన్న పాత్రలో నటించింది. పక్కింటి అమ్మాయిలా ఉండే లయ ఎక్స్ పోజింగ్ కి ఏమాత్రం చోటివ్వకుండా సంప్రదాయంగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. అందుకే హీరోయిన్ లయ హోమ్లీ హీరోయిన్ గా నిల్చింది. అయితే ఇటీవల ఆమెపై కొన్ని వార్తలు వైరల్ అవ్వడంతో ఆగ్రహం వ్యక్తంచేసూ ఎమోషన్ అయింది. సోషల్ మీడియా వచ్చాకే ఇలాంటి దుష్ప్రచారాలు ఎక్కువయ్యాయని పేర్కొంది.

సామాజిక మాధ్యమాలలో ఫ్యామిలీ ఫోటోలు పెట్టాలంటేనే భయంగా ఉందని, చివరకు చిన్నపిల్లలను సైతం వదలడం లేదని లయ విచారం వ్యక్తంచేసింది. ఇంతకీ లయకు ఇంత కోపం రావడానికి కారణం ఏమిటంటే, ఈమధ్య తెలుగు స్పష్టంగా మాట్లాడలేకపోయిందట. ఎక్కువకాలం అమెరికాలో ఉండిపోవడం వలన తెలుగు వరస్ట్ గా మాట్లాడుతోందంటూ కథనాలు వచ్చాయి.

తెలుగు మాట్లాడలేని లయ అంటూ ప్రచారం వైరల్ అయింది. ఈనేపథ్యంలో లయ ఓ ఇంటర్యూలో ఎమోషన్ అవుతూ, ఆవేదన వ్యక్తంచేసింది. అయినా తన మాట తీరే అంతని, దీనికి తోడు వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు కొంత తేడా వస్తుందని ఆమె పేర్కొంది. ఇక ఖచ్చితంగా తెలుగు మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారని లయ చెప్పుకొచ్చింది.

ఫంక్షన్స్ లో తెలుగు సరిగ్గా మాట్లాడకుండా బూతులు మాట్లాడుతున్నారని, అయితే ఆలాంటి వాళ్ళను ప్రశ్నించకుండా తనలాంటి వాళ్లపై ఇలా ప్రచారం చేయడం బాధగా ఉందని లయ పేర్కొంది. ‘అమెరికాలో నా బతుకు నేను బతుకుతున్నాను. నా భాష సరిగ్గా లేదని ఆడిపోసుకోవడం న్యాయమా. అమ్మాయిలంటే అంత చులకనా? మీ ఇంట్లో అమ్మ, అక్క,ఇలా చాలామంది ఉంటారు కదా,వాళ్ళను కూడా ఇలాగే ప్రశ్నిస్తారా? మనిషి మనిషికి ఓ న్యాయమా?’అని కంటతడి పెట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here