రాజ్ తరుణ్ “లవర్” మూవీ రివ్యూ

0
1430

యంగ్ రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాల చిత్రంతో అచ తెలుగు కుర్రాడిగా ఆడియన్స్ కు చేరువయ్యాడు. ఆతరువాత కూడా రాజ్ తరుణ్ కొన్ని మంచి విజయాలు అందుకున్నాడు. ఇటీవల ఈ యంగ్ హీరోకు సరైన సక్సెస్ దక్కడం లేదు. రాజుగాడు రంగులరాట్నం, అంధగాడు వంటి చిత్రాలు నిరాశ పరిచాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో నటించిన లవర్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆసక్తికరమైన ప్రేమ కథగా వస్తున్న ఈ చిత్రం ఎలా ఉందొ మన సమీక్షా లో తెలుసుకుందాం.

టాలీవుడ్‌లో విజయవంతమైన నిర్మాతగా పేరొందిన దిల్ రాజు ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేశారు. ఆయన బ్యానర్‌లో సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. లవర్ మూవీ రాజ్ తరుణ్ రీసెంట్ గా యాక్ట్ చేసిన సినిమాలలో కెల్లా మంచి సినిమా అని చెప్పొచ్చు. స్టోరీలో కొత్తదనం ఔటాఫ్ ది బాక్స్ లాంటి ప్రెసెంటేషన్ ఏమి లేకపోయినా మన దిల్ రాజు బ్యానర్ వాల్యూ & వెర్త్ ఈ సినిమాలో మనకు కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది. అంటే సినిమా అంతా చాలా నీట్ గా క్లాస్ గా వెళ్లిపోతుంటుంది.

ఇంక పెరఫార్మన్సెస్ విషయానికి వస్తే రాజ్ తరుణ్ తాను నటించిన ఇంతకూ ముందు సినిమాలతో పోలిస్తే కొంచం నీట్ గా మరీ మాస్ యాక్టింగ్ లేకుండా క్లాస్ యాక్టింగ్ తో బాగానే పెర్ఫర్మ్ చేసాడనే చెప్పొచ్చు. కానీ రాజ్ తరుణ్ అలా భయంకరంగా ఫైట్లు బీభత్సముగా షాట్లు కొడుతుంటే చూడ్డానికి మనకి కొంచం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే రాజ్ తరుణ్ తనకు వెనకాల ఉన్న పిలక తో తన లుక్ ని డ్రస్టిక్ గా చేంజ్ చేసాడని అనుకున్నాడు కానీ పర్లేదు ఆ పిలక ఒక్కటే కనిపిస్తుంది కానీ తన లుక్ ఎంత చేంజ్ అవ్వలేదు.

ఈ సినిమాలో హీరోయిన్ కి ఫుల్ లెన్త్ రోల్ ఉంటుంది. ఆ రోల్ లో ఆ అమ్మాయి ఒక మళయాళిలాగా… ఒక నర్స్ లాగా ఎమోషనల్ సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ… సెంటిమెంటల్ సీన్స్ కానీ… అక్కడక్కడా మధ్య మధ్యలో సాంగ్స్ లో స్టెప్స్ కానీ… సాంగ్స్ లో ఎక్స్ప్రెషన్స్ కానీ… చాలా బాగా ఇచ్చి రాజ్ తరుణ్ కి ఒక మంచి పెయిర్ లాగా ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది.

రాజీవ్ కనకాల అన్ని సినిమాలలో లాగా అలా కనిపించి ఇలా వెళ్లిపోకుంగా కొంచం మంచి లెన్త్ ఉన్న క్యారెక్టర్ ను రాజీవ్ కనకాల ఈ సినిమాలో చేసారు. రాజీవ్ కనకాల క్యారెక్టర్ ఈ సినిమాలో కొంచం గంభీరంగా ఉండాలి కాబట్టి వాయిస్ కొంచం, బాగా.. గట్టిగా.. మాట్లాడుతుంటారు అన్నమాట. అది తప్ప అయన పెర్ఫార్మన్స్ అంత బాగానే ఉంటుంది. ఇంకా అజేయ్ కానీ.. మన హీరో ఫ్రెండ్స్ కానీ.. సుబ్బరాజ్ కానీ.. వాళ్ళ పాత్రలకి తగ్గట్లు బాగానే యాక్ట్ చేసారు. హీరో ఫ్రెండ్స్ తో ఉన్న కొన్ని కామెడీ సీన్స్ డైలాగ్స్ కొంచం మనకి హిలిరియస్ గా అనిపిస్తాయి.

ఇక ఈ సినిమా లో విలన్ విషయానికి వస్తే ఆయన మాత్రం ఈ సినిమాలో బాగ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు బిల్డప్స్ కి తప్ప ఒక డైలాగ్ కానీ.. ఒక ఎక్స్ప్రెషన్ కానీ.. అలాంటివి ఏమి ఉండవన్నమాట. అయన జస్ట్ నడుస్తుంటాడు బాగ్రౌండ్ మ్యూజిక్ వాస్తు ఉంటుంది. అయన ఒక పెద్ద విలన్ అని ఎస్టాబ్లిషమెంట్ జరుగుతుంటుంది. అప్పుడు మనం “ఓ ఈయన చాలా పెద్ద విలన్ అన్నమాట… O my god he is very dangerous ” అని అనుకోని మనం ఫీల్ అవ్వాలన్నమాట ఆ మ్యూజిక్ కి ఆ ప్రెసెంటేషన్స్ కి.

ఈ సినిమాకి హైలైట్ మ్యూజిక్ బాగ్రౌండ్ స్కోర్ కానీ.. నాలుగు పాటలు చాలా చాలా బాగున్నాయి. చాలా మంది మ్యూజిక్ కొట్టినట్లు ఉన్నారు. అందుకే ఒక్కొక పాట ఒక్కో రకంగా సాంగ్స్ మనకి బాగానే ఉంటాయి. సాంగ్స్ పిక్చరైజషన్ కూడా చాలా నీట్ గా ప్లెసెంట్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్. సెకండ్ హాఫ్ మొత్తం కొంచం సెంటిమెంట్, యాక్షన్, స్టోరీ లాస్ట్ కి వచ్చేసరికి ఒక సాఫ్ట్ వెరే లెసన్ వస్తుంది. ఆ లెసన్ మనకి కొంచం మనకి ” అః ఓకే ఇలాగా ” అని మనకి అనిపిస్తుంది. ఇక మన తెలుగు సినిమాలలో మనకి రొటీన్ టెంప్లేట్ లాగా మన హీరోయిన్ హీరోకి ఎందుకు పడిపోయింది. ఛా ఇంత సింపుల్ గా పడిపోతారా అన్నట్లు ఈ మూవీ లోకూడా ఫస్ట్ హాఫ్ లో మన హీరోయిన్ మన హీరోని లవ్ చేస్తుందన్నమాట.

ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్స్ కొన్ని బాగున్నాయి. ఎంటర్టైన్మెంట్ మొత్తం ఫస్ట్ హాఫ్ లో ఉంది. సెకండ్ హాఫ్ లో కేరళలోని సీన్స్ కానీ ఆ మలయాళం కైండ్ అఫ్ కన్వెన్షషన్ కానీ ఓకే పారలేదు అనిపిస్తాయి. ఇంకా మధ్య లో వచ్చే ఒక ట్విస్ట్ అదికూడా బాగానే ఉంటుంది. ఇంకా లాస్టుకి వచ్చేసరికి మనం అందరం అనుకున్నట్లు గానే సినిమా ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా రొటీన్ స్టోరీ.. రొటీన్ ప్రెసెంటేషన్ కాబట్టి. సెకండ్ హాఫ్ చూసినతరువాత మనకి ఎదో సినిమా గుర్తొస్తుంది ఆ సినిమా ఏంటనేది సినిమా చూసి మిరే గెస్ చెయ్యండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here