బిగ్ బాస్ 2 లోకి ఎంటరైన నందిని గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు.

0
1601

బిగ్ బాస్2 లోకి సంజన అన్నే ఎలిమినేట్ అయిన తరువాత అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ బిగ్ బాస్ 2 షో లోకి కొత్త కంటెస్టెంట్ నందిని రాయ్ ( Nandini Rai ) ని నాని ఆహ్వానించాడు. అయితే ఇప్పుడు ఈమె ఎవరు ఎక్కడి నుండి వచ్చారు ఇంతకూ ముందు ఏ సినిమాలు చేసారు అని నెటిజన్స్ అందరు తెగ వెతకడం స్టార్ట్ చేసారు. నిజానికి ఈమె బిగ్ బాస్2 మొదలయ్యే రోజే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఉండాలి కానీ ఈమెకు అనుకోకుండా ఆక్సిడెంట్ అవ్వడంతో ఈ వారం ఆమెను బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారు. ఆమె గురించి పూర్తీ వివరాలు క్రింద ఉన్నాయి ఒక లుకేయ్యండి.

నందిని రాయ్ హైదరాబాద్ కి చెందిన అమ్మాయి. ఆమె Hyderabad St. Albans High School నుండి 2003 లో పాస్ అయ్యి బయటకు వచ్చింది. ఉన్నత చదువులకోసం లండన్ వెళ్ళింది. అక్కడినుండి ఎంబీఏ ఫైనాన్స్ పూర్తీ చేసింది. ఆమె 80 కి పైగా ఇండియన్ అండ్ ఇంటెర్నేషన్ బ్రాండ్స్ కి మోడల్ గా వ్యవహరించింది. నందిని రాయ్ మోడలింగ్ చేస్తున్న తరుణం లో ఆమెకు 2008 మిస్ హైదరాబాద్ కిరీటం, 2009 లో ఫ్రెస్ పేస్ అఫ్ ఆంధ్రప్రదేశ్, 2010 లో మిస్ ఆంధ్రప్రదేశ్ వంటి బ్యూటీ కాంటెంట్స్ లలో విజేతగా నిలిచింది.

నందిని రాయ్ 2011 లో ఫామిలీ ప్యాక్ అనే హిందీ సినిమాతో తన సినిమా కెరియర్ ని స్టార్ చేసింది. 2013 లో మలయాళం లో “గుడ్ బాయ్ డిసెంబర్” అనే సినిమాలో నటించింది. 2014 లో తెలుగు తెరకు “మాయ” అనే సినిమాతో మన ముందుకు వచ్చిన ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తరువాత కన్నడలో ఖుషి ఖుషీగా అనే సినిమాలోనూ నటించింది.

దాని తరువాత మళ్ళీ 2015 తెలుగులో సుదీర్ బాబు సరసన మోసగాళ్లకు మోసగాడు అనే సినిమాలో నటించింది. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినింది ఎప్పుడు ధియేటర్స్ నుండి వెళ్లి పోయిందో ఎవ్వరికి తెలియదు. అందువలన ఈమెకు ఈ సినిమాతో గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతానికి తమిళ్ లో గ్రహణం, తెలుగులో సుడిగాడు 2 అనే రెండు సినిమాలు చేస్తున్న సమయం లో బిగ్ బాస్ 2 లో అవకాశం వచ్చింది. మరి ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని నందిని ఏ మేరకు ఉపయోగించుకుంటుందో వేచి చూడాల్సిందే.

నందిని రాయ్ తన ఫేస్బుక్ లో షేర్ చేసిన కొన్ని ఫన్నీ Dubsmash వీడియోస్ మీకోసం.

This is Crazy Dubsmash by Nandini Rai

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here