మరోసారి పాల్ పై వర్మ ట్వీట్.. ఈ సారి అదిరిపోయింది..

0
720

వివాదాల వర్మ … మరో సారి సంచలన కామెంట్ చేశాడు. కేఏ పాల్ , ఆర్జీవీల మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా… తాజాగా వర్మ పాల్ పై మరో సారి ట్వీట్ తో విరుచుకుపడ్డాడు. రాంగోపాల్ వర్మ ఓ హోటల్ లో తన కాళ్లు పట్టుకున్నాడని .. కేఏపాల్ మీడియతో వెల్లడించగా… అవును.. పట్టుకుందామనే అనుకున్నాను.. కాళ్లు పట్టుకుని వెనక్కి పడేద్దామనే అనుకున్నాను..

కానీ ఉన్న మెదడు పోతుందని ఊరుకున్నానని ఘాటుగా ఆన్సర్ ఇచ్చాడు వర్మ. ఇదిలా ఉంటే నేను ఖచ్చితంగా సీఎం అవుతానని పాల్ చేస్తున్న వ్యాఖ్యలు .. పసి పిల్లాన్ని కూడా నవ్విస్తుండగా… తన ఎనిమీ ఆర్జీవీ నవ్వకుంటా ఉంటాడా..? ఓ కామెంట్ చేయకుండా కామ్ గా ఉంటాడా..? .. అందుకే తన ఎకౌంట్ నుంచి.. ఓ ట్వీట్ ను వదిలాడు.

జీసస్ నాకు చెప్పాడు… ఎన్నికల్లో పోటీ చేస్తే పాల్ కు ఒక్క ఓటు కూడా పోల్ కాదని.. కనీసం పాల్ కూడా తన ఓటు తనకు వేసుకోడట… అంటూ పోస్ట్ పెట్టాడు. దీనిపై ఇంకాస్త కామెడీ జోడించిన నెటిజన్లు.. మీకు జీసెస్ అలా చెప్పాడా..? మాకైతే కేఏ పాల్ అసలు పోటీలోనే నిలబడని చెప్పాడు అంటూ కామెంట్లు పెడ్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here