150 కోట్లు సంపాదించే దమ్ముంది, చెప్పు తీసుకుని కొట్టాలి… నాగబాబు ఆగ్రహానికి కారణం ఆ కామెంట్సే!

0
296

పార్టీ పెట్టగానే అధికారంలోకి రావాలి, పార్టీ పెట్టగానే గెలిచి పోవాలి అనే ధోరణి ఉంది కాబట్టే ప్రజరాజ్యం పార్టీకి అంత స్పందన వచ్చినా… 18 శాతం ఓట్ షేర్ వచ్చినా.. చివరకు అలాంటి పరిస్థితిలోకి వెళ్లింది. పార్టీని కొనసాగిస్తే పరిస్థితి ఇపుడు ఇంకో రకంగా ఉండేది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. దీంతో నేను ఏకీభవిస్తున్నాను అని మెగాబ్రదర్ నాగబాబు అన్నారు. అన్నయ్యపై అపుడు మానసికంగా ప్రెజర్ తీసుకొచ్చి, ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన కొందరు పార్టీని వారి స్వార్థ ప్రయోజనాల కోసం విలీనం చేయించారు. వాస్తవానికి చిరంజీవిగారికి అలాంటి ఉద్దేశ్యం లేదని ఆయన స్పష్టం చేశారు.

చిరంజీవిగారు పార్టీని నడపటానికి భయపడ్డాడు, పిరికి తనం వల్లే అలా చేశాడు అనే మాటను నేను అంగీకరించను. చిరంజీవిగారు మొండి వ్యక్తి కాదు, అలా అని పిరికి వ్యక్తి కాదు. పిరికివాడైతే ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకుని నెం.1 స్థానంలోకి వచ్చేవాడు కాదు. ఆయన చాలా ధైర్యవంతుడని నాగబాబు తెలిపారు. అన్నయ్య ఏ విషయాన్నైనా చాలా పద్దతిగా ఆలోచించి, ఎలా ముందుకు వెళ్లాలి అనే క్లారిటీ ఉన్నవ్యక్తి. రాజకీయాల్లో చేయలేక పోవడానికి కారణం అతడి సెన్సిటివ్‌నెస్. పార్టీలో కొందరు పాములు, వృద్ధ జంబూకాలు ఆయన సెన్సిటివ్‌నెస్‌పై ఎక్కువ ప్రభావం చూపాయి. ఆయన ఈ పార్టీ నడపటం కుదరదు అనే రేంజికి తీసుకొచ్చారని తెలిపారు.

పవన్ కళ్యాణ్ ప్యాకేజీలు తీసుకుంటాడు.. ప్యాకేజీలు తీసుకుని పని చేస్తాడు.. ఎప్పుడు డబ్బులు లేక పోతే అప్పుడు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడతాడు.. డబ్బులు రాగానే లోపలికి వెళ్లిపోతాడు అని కొందరు చేస్తున్న ఆరోపణలపై నాగబాబు తీవ్రంగా స్పందించారు. అలా అనే **** చెప్పుతీసుకుని కొట్టాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. కళ్యాణ్ బాబుకు ప్యాకేజీలు తీసుకునే అవసరం ఏమిటి? సినిమాలు చేస్తే కోట్లు వస్తాయి. వారిచ్చే ప్యాకేజీలు కళ్యాణ్ బాబు ఒక రోజు సంపాదన అంతకూడా ఉండదు. వరుసగా సంవత్సరం పాటు రెండు సినిమాలు, నాలుగు యాడ్లు చేస్తే 150 కోట్లు సంపాదించగలిగే దమ్మున్నోడు. అంత సంపాదించే వ్యక్తికి ప్యాకేజీల కోసం పాకులాడే అవసరం ఏమిటి? ఆ కామెంట్ ఎవరైతే చేశారో వారిని ‘బాస్టర్డ్స్’ అని అంటాను… అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here