ప్రయాణంలో వాంతులా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!

0
520

చిన్న అల్లం ముక్కను దవడ లోపల పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం చాలా తక్కువ. అల్లంలో క్యాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ వంటి ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వక్కపొడిని చప్పరించినా వాంతి సమస్య నుంచి బయటపడొచ్చు. నిమ్మకాయను కొద్ది కొద్దిగా నలుపుతూ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీలిస్తే కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

లవంగాలు, సోంపు వంటివి దవడలో పెట్టుకుని చప్పరించినా కూడా వాంతులు రాకుండా ఉంటాయి. వాంతులు ఎక్కువగా వచ్చేవారు కారు, బస్సు ఎక్కినప్పుడు ముందు సీట్లో కూర్చొని పరిసరాలను గమనిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. సెల్‌ఫోన్‌లో ఇష్టమున్న పాటలు వింటూ వాంతి గురించిన ఆలోచనల్ని రాకుండా చూసుకుంటే వాంతులు వచ్చే ప్రమాదం ఉండదు. మసాలా ఫుడ్, జంక్ ఫుడ్ ఫుల్లుగా తినేసి ప్రయాణం ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల బస్సు కదలికలకు, సరిపడా వాటర్ ఎక్కువగా తాగకపోవడం వల్ల కూడా వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణం చేయాలనుకునే వారు లైట్ ఫుడ్ తీసుకోవడం బెటర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here