అరేయ్ పృథ్వి.. నాకు ఫోన్ చేయి.. ఆ మాట అనగానే రెచ్చిపోయిన నాగబాబు!

0
627

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల సోషల్ మీడియా వేదికగా వరుస వీడియోలతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలని టార్గెట్ చేస్తూ నాగబాబు చేస్తున్న వీడియోలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్, చిరంజీవిపై వచ్చే విమర్శలపై కూడా ఈ మెగా బ్రదర్ స్పందిస్తున్నారు. నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనసేన పార్టీకి తాను, తన కుమారుడు వరుణ్ ఇచ్చిన విరాళం గురించి వస్తున్న విమర్శలపై స్పందించారు. మరోమారు మహిళ వస్త్రధారణ గురించి విమర్శలు చేసేవారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు, ఆయన తనయుడు వరుణ్ తేజ్ కలసి 1.25 కోట్లు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విరాళంపై కమెడియన్ పృథ్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కడినుంచో తీసుకొచ్చిన డబ్బుని తన కొడుకు ఖాతాలో వేసి దానిని జనసేన పార్టీకి ఇచ్చారని పృథ్వి వ్యాఖ్యానించాడు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు నాగబాబు దృష్టికి రావడంతో ఆయన పృథ్వికి వార్నింగ్ ఇచ్చారు. నిజంగానే పృథ్వి ఆ మాట అన్నాడా.. అయితే అతడికి ఇదే నా సమాధానం. అరేయ్ పృథ్వి నువ్వు నాకు ఫోన్ చేయి రా.. నా నంబర్ నీదగ్గర ఉంది. ఈ ప్రశ్నకు నీకు మాత్రమే సమాధానం చెబుతా. ఎవడో ఎదో అంటే అందరి ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని నాగబాబు అన్నారు. తాను, వరుణ్ తేజ్ కలసి టాక్స్ కట్టిన డబ్బునే అధికారికంగా జనసేన పార్టీకి ఇచ్చామని అన్నారు.

ఇదివరకే మహిళల డ్రెస్ గురించి కొందరు చేస్తున్న కామెంట్స్ పై నాగబాబు స్పందించారు. మరోమారు అలాంటి విమర్శలు చేస్తున్నవారిపై రెచ్చిపోయారు. ఒక మహిళ కానీ, హీరోయిన్ కానీ అందంగా కనిపించడం కోసం తనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటే తప్పు ఎలా అవుతుంది అని అన్నారు. మహిళల డ్రెస్ గురించి కామెంట్స్ చేసే అధికారం ఏ మగాడికి లేదని అన్నారు. తాను ఓ తల్లికి బిడ్డని, నా కూతురికి తండ్రిని, ఇద్దరు చెల్లెలు అన్నని.. కాబట్టే మహిళలకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటా అని నాగబాబు అన్నారు.

తమ కుటుంబాన్ని చాలా రోజులుగా టార్గెట్ చేస్తూ విమర్శించేవాళ్ళు ఎక్కువవుతున్నారని నాగబాబు అన్నారు. అందుకే తాను కూడా తిరిగి స్పందిస్తున్నాని అన్నారు. చిరంజీవి గారు టాలీవుడ్ లో నెం 1స్టార్ గా మారిన సమయం నుంచే ఆయనపై కొందరు రాళ్లు వేయడం ప్రారంభించారని అన్నారు. కానీ ప్రతి రాయితో ఆయన భారీ కోటని నిర్మించుకుని టాలీవుడ్ లో ఈ స్థాయికి ఎదిగారని తెలిపారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై అనవసరమైన విమర్శలు చేసేవాళ్ళు ఎక్కువవుతున్నారు కాబట్టే సోషల్ మీడియా వేదికగా తాను స్పందించాల్సి వస్తోందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here