మీరు పుట్టిన తేదీలో ఈ నెంబర్ ఉంటే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరట!

0
1063

పురాతన సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేది మీ ఆర్థికపరమై విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుందని అంటారు. సంపద, విజయాల రహస్యం పుట్టిన రోజును బట్టి ఆధారపడి ఉంటాయట. సంపాదన కోసం కష్టపడటం, విజయాలను సాధించి ప్రశాంతంగా గడపాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. కానీ అనుకున్నట్లుగా అందరూ దాని ఫలితాల్ని అందుకోలేరు. జ్యోతిషశాస్త్రం ప్రకారం పుట్టిన సమయం, తేది, రోజు, నెల, సంవత్సరాన్ని బట్టి వ్యక్తిగతంగా జన్మ పట్టికను తయారు చేస్తారు. ఇది జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుందని అంటారు. అవేమిటో చూద్దాం…

* దీన్ని అతను పుట్టిన తేది, నెల, ఏడాదిని కలిపి లెక్కిస్తారు. ఉదాహరణకు ఓ వ్యక్తి 18 నవంబరు 1989లో జన్మించాడు అనుకుంటే.. అతని అదృష్ట సంఖ్య 1+8+1+1+1+9+8+9= 38: 3+8=11: 1+1= 2.. వచ్చిన అంకెల ఆధారంగా మీ జాతకం కింది విధంగా ఉంటుందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. * పుట్టిన సంఖ్య 1 అంకెతో ముడిపడి ఉంటే మీ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచుతారు. ఆదివారం చక్కెరతో చేసిన పదార్థాలను తింటారు. వీరు ప్రతి రోజూ సూర్య నమస్కారాలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెబుతారు. * పుట్టిన సంఖ్య 2 అంకెతో ముడిపడి ఉంటే సోమవారం ఉపవాసం ఉండండి, లేకపోతే కనీసం ఆరోజు ఉప్పును స్వీకరించవద్దని అంటారు. * పుట్టిన తేదిలో 3 అంకె ఉంటే గురువారం పసుపు రంగు దుస్తులు ధరించండి. దీనివల్ల మీ అదృష్టం రెట్టింపవుతుందట.

* పుట్టిన తేదిలో 4 అంకె ఉంటే గణేశుడ్ని పూజించండి. దీనివల్ల జీవితంలో ఉండే ప్రతికూలతలు తొలగిపోతాయని చెబుతున్నారు. * పుట్టిన తేదిలో 5 అంకె ఉంటే ప్రతి బుధవారం ఆవులకు బెల్లం, పచ్చగడ్డి తినిపించండి. అలాగే విఘ్నేశ్వర స్తోత్రాన్ని స్మరిస్తే జీవితంలో విజయాలు మీ వెంటే ఉంటాయని అంటున్నారు. * పుట్టిన తేదిలో 6 అంకె ఉంటే గురువారం స్వీట్ లేదా చక్కెర పూసిన ఆహార పదార్థాలను తీసుకోని లక్ష్మీ అష్టోత్తరాన్ని స్మరిస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందట. * పుట్టిన తేదిలో 7 అంకె ఉంటే నల్లని రంగు కుక్కలకు సద్భక్తితో ఆహారం అందించి, శివునికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుందని చెబుతారు. * పుట్టిన తేదిలో 8 అంకె ఉంటే రావి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించాలి. అగరువత్తులతో శని దేవుని పూజించడమే కాకుండా మధ్యం, మాంసాహారాన్ని పూర్తిగా వదిలేయాలి. * పుట్టిన తేదిలో 9 ఉంటే ప్రతి మంగళవారం అంజనేయుడిని భక్తితో కొలిచి, హనుమాన్ చాలీసాను పఠించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here