2019 ఫిబ్రవరి 23 శనివారం రాశి ఫలాలు…. ఒక్క రాశి వారికి అధిక శ్రమ?

0
353
  1. మేష రాశి…ఈ రాశి వారిలో ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు. వృతి,వ్యాపారాలను బాగా విస్తరిస్తారు. ఆర్ధిక లావాదేవీలు అన్నీ లాభసాటిగా ఉంటాయి. చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. పాత బాకీలు అన్ని వసూలు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. 2. వృషభ రాశి….చేసే పనిలో కొన్ని ఆటంకాలు ఎదురు అయినా చివరకు పూర్తి చేయటంలో సక్సెస్ అవుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు చేసేసమయంలో స్థిరత్వం ఉండదు. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. స్నేహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇంట బయట ఉండే ఒత్తిడి నుండి బయట పడతారు.

3. మిధున రాశి…వీరు చేసే ముఖ్యమైన వ్యవహారాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. తండ్రి ఉంచి ఆస్థి లాభం పొందుతారు ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. 4. కర్కాటక రాశి…చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందువినోదాలలో బంధువులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. వాహనాలు నడిపే విషయంలో నిర్లక్ష్యం తగదు.

5. సింహ రాశి…బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆనారోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. నూతన మిత్రులతో పరిచయం ఏర్పడుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కొనసాగిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. 6. కన్య రాశి … ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు చికాకు కలిగిస్తాయి. కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. బంధువులతో మాటపట్టింపులు ఏర్పడతాయి. 7. తుల రాశి …
ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.

8. వృశ్చిక రాశి…బంధువులతో కలిసి ఉత్సాహంగా గడుపుతారు. విందువినోదాలలో పాల్గొంటారు. ప్రారంభించిన పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయమవుతారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది, వాహన యోగం ఉంది. ఉద్యోగ, వివాహయత్నలు కలిసి వచ్చేకాలం. 9. ధనస్సు రాశి…ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆర్థిక లావాదేవీలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. 10. మకరం… బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు కొనసాగిస్తారు. కుటుంబసభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయం ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల, వాహనాలు నడిపే విషయాలలో అప్రమత్తంగా ఉండాలి.

11. కుంభం…ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలు చేపడతారు. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. నూతన వ్యాపారాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. లక్ష్మీచందనంతో మహాలక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయండి. 12. మీనం…ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ఉద్యోగాలకు స్థాన చలనం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here