బిగ్ బాస్ 2 లో కామన్ గర్ల్ సంజన గురించి ఎవరికి తెలియని నిజాలు.

0
1489

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం రాత్రి 9 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదటి సీజన్ సూపర్ హిట్ కావడం.. మంచి ఎంటర్ టైన్ మెంట్ అందించడం.. సెకండ్ సీజన్ పై అంచనాలు పెరిగాయి. ఎన్టీఆర్ స్థానంలో నాని ఎంట్రీ ఇవ్వడం ఈసారి షో ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. 16మంది కంటెస్టెంట్లతో 106 రోజుల పాటు ఈ షో సాగబోతోంది. గత సీజన్ కంటే మరింత మసాలా దట్టించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

ఈ సారి సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు. విజయవాడకు చెందిన RJ గణేష్ , వైజాగ్ సోషల్ వర్కర్ నూతన్ నాయుడు తో పాటు.. ఎమర్జింగ్ మోడల్ “సంజన అన్నే” కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయింది. వీరిలో సంజన పర్సనల్ డీటేల్స్ విషయానికి వస్తే ఆమె అసలు పేరు వనజ సాయి సంజన చౌదరి. వృతి రీత్యా ఒక ఫ్యాషన్ మోడల్. సంజన తల్లిదండ్రులు విజయవాడలో సెటిల్ అయ్యారు. దాంతో ఆమె విద్యాభ్యాసం బెజవాడలోనే సాగింది.

ఇక మోడలింగ్ రంగం పై ఆసక్తితో హైదరాబాద్ చేరుకొని అనేక మోడలింగ్ ఏజెన్సీ లకు తన పోర్టుఫోలియోలను పంపింది. వాటిలో కొన్ని ఏజెన్సీలు సంజనకు అవకాశం కల్పించాయి. అయితే 2016 లో మిస్ హైదరాబాద్ గా ఎన్నికైన తరువాత ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. తెలుగు రాష్ట్రాలలోని కాదు తమిళనాడు కర్ణాటకలలోను అనేక బ్రాండ్ లకు మోడలింగ్ చేసింది.

2017 లో గోల్డెన్ గ్లోబెల్ కిరీటం కూడా సంజనను వరించింది. మోడలింగ్ మాత్రమే కాదు అనేక అందాల పోటీలకు న్యాయ నిర్ణేతగాను & బ్రాండ్ అంబాసిడర్ గాను వ్యవహరించింది సంజన. సంజన ప్రిన్సెస్ అఫ్ అమరావతి అందాలపోటీలకు బ్రాండ్ అంబాసిడర్ గాను, మిస్ AP పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.

వీటన్నిటికంటే ముఖ్యంగా అందాల పోటీలకు తలమానికం లా నిలిచే మిస్ ఇండియా పోటీలలో ఫైనల్ లిస్ట్ కి ఎంపికై తృటిలో విజేతగా నిలిచే అవకాశాన్ని చేయిజార్చుకుంది. అయితే మిస్ ఇండియా పోటీలలో ఫైనల్ రౌండ్ వరకు వెళ్లడం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. దాంతో మోడలింగ్ రంగంలో మరిన్ని అవకాశాలు లభించాయి.

మొన్నటివరకు ఆమె లేటెస్ట్ అస్సైన్మెంట్ల కోసం న్యూయార్క్, పారిస్ వంటి ప్రదేశాలలో ఫోటో షూట్లలో పాల్గొంది. ఇటీవలే ఆమె పుట్టిన రోజు సందర్భంగా తండ్రి నుండి బ్రాండ్ న్యూ మారుతి కారు ను గిఫ్ట్ గా అందుకుంది. చూడంగానే ఎంతో మోడరన్ గా కనిపించే సంజన మాటలలో ఎంతో దూకుడు కనిపిస్తుంది. బిగ్ బాస్ తొలి రోజే అది స్పష్టమైంది. బిగ్ బాస్ కి సెలెక్ట్ కాకా ముందునుండే టాలీవుడ్ లో అవకాశాలకోసం ప్రయత్నిస్తున్న ఈ బెజవాడ బ్యూటీ హీరోయిన్ అయ్యేందుకు అన్ని లక్షణాలు తనలో ఉన్నాయి అని అంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫెమ్ ని చిత్ర రంగం లో ఛాన్స్ లకోసం ఉపయోగించు కుంటానని సంజన చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here