‘శ్రీదేవి బంగ్లా’లో ప్రియా ప్రకాష్.. వైరల్‌ అవుతున్న ట్రైలర్..

0
670

ఇంకా తొలి సినిమా కూడా విడుదల కాలేదు అప్పుడే రెండో సినిమాతో వ‌చ్చేస్తుంది ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్. అది కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. కన్నుగీటి కుర్రకారు మతిపోగొట్టిన ప్రియా ప్రకాష్ వారియర్. కేవలం ఒకే ఒక్క పాటతో ప్రపంచ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించి ఓవర్ నైట్ స్టార్‌గా మారింది.

ఒక్కసారిగా ఇంటర్‌నెట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ భామ ఓ బాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతోంది. అది కూడా శ్రీదేవి పాత్రతో వస్తూ షాకిస్తోంది. ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీదేవి బంగ్లా’ లో శ్రీదేవిగా నటిస్తోంది ప్రియా ప్రకాష్. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.

ఒక నిమిషం 49 సెకనుల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్‌ని.. ఎంతో ఆసక్తికరంగా మలిచారు. ఓ చిన్న అమ్మాయికి ప్రియా ప్రకాష్ ఆటోగ్రాఫ్ ఇచ్చే సన్నివేశంతో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ‘మీకు ఇష్టమైన నటి ఎవరు’ అని ఆ చిన్నారి అడగ్గా.. ‘నాకు ఇష్టమైన నటి నేనే..’ అని ప్రియా చెప్పటం, నటిగా తాను ఎంతో అదృష్టవంతురాలినని.. తనకు ఆ దేవుడు అన్నీ ఇచ్చాడని చెబుతూ ప్రియా సరదాగా ఎంజాయ్ చేస్తుండటం మొదట చూపించారు. ఆ తర్వాత కాలింగ్ బెల్ మోగటం.. ఆ వెంటనే ప్రియా ఏడుస్తూ కనిపించటం చూపించి ఆసక్తి రేపారు. మందు తాగటం, సిగరెట్ తాగటం లాంటి సన్నివేశాలు చూపించి.. చివర్లో బాత్ టబ్‌లో ఓ శవం కాళ్లు చూపించి సినిమా పై అంచనాలు పెంచేశారు. ఈ ట్రైలర్ చూడగానే.. శ్రీదేవి జీవితంలోని కీలక సంఘటనలు ఈ సినిమాలో చూపించనున్నారా? అనే అనుమానం మొదలైంది ప్రేక్షకుల్లో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here