భద్రాద్రి శ్రీరామనవమి టిక్కెట్లు నేటి నుంచి ఆన్‌లైన్‌లో లభ్యం

0
327

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగనున్న శ్రీరామనవమి ఉత్సవాల టిక్కెట్లను నేటి నుంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్టు ఆలయ ఈఓ టి.రమేష్ బాబు తెలిపారు. ఏప్రిల్‌ 14న స్వామి వారి తిరు కల్యాణం, 15న జరిగే శ్రీరామ మహాపట్టాభిషేకాలు జరుగనున్నాయి.

సీతారామ కల్యాణం వీక్షించే భక్తుల సౌకర్యార్దం రూ.5 వేలు, రూ.2 వేలు, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి. అలాగే పట్టాభిషేకం రోజుకు సంబంధించి రూ.250, రూ.100 టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఆసక్తి గల భక్తులు భద్రాచలం ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో టికెట్లు కొనుగోలు చేసుకోగలరు. ఇదిలా ఉండగా రూ.5 వేల శ్రీరామనవమి కల్యాణం ఉభయదాతల టికెట్లు దేవస్థానం కార్యాలయంలో విక్రయిస్తున్నారని ఆసక్తి గల భక్తులు దేవస్థానం పనివేళలల్లో సంప్రదించాలని ఈఓ రమేష్ బాబు కోరారు. వివరాలకు 08743-232428 నెంబర్‌కు సంప్రదించగలరు. bhadrachalamonline.com వెబ్ సైట్లో టిక్కెట్ల విక్రయాలు కొనసాగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here